Canada | అంత్యక్రియల ఖర్చు 30 లక్షలు.. భరించలేక మృతదేహాల్ని వదిలేస్తున్న కుటుంబసభ్యులు
తమ వారి అంత్యక్రియలను గౌరవంగా జరిపించి తుది వీడ్కోలు పలకాలని ప్రతి కుటుంబం అనుకుంటుంది.
- కెనడాలో దయనీయ పరిస్థితులు
- పెరుగుతున్న అనాథ మృతదేహాలు
Canada | ఒట్టావా: తమ వారి అంత్యక్రియలను గౌరవంగా జరిపించి తుది వీడ్కోలు పలకాలని ప్రతి కుటుంబం అనుకుంటుంది. కానీ, కెనడాలో మాత్రం కొన్ని కుటుంబాలు అయిన వారి మృతదేహాలను అనాథ శవాలుగా వదిలేసే దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పెరిగిన అంత్యక్రియల ఖర్చులను భరించలేక మృతులు తమ వారేనని తెలిసినా మృతదేహాలను తీసుకోవడం లేదు. దీంతో దేశంలోని అన్ని ప్రావిన్సుల్లో అనాథ మృతదేహాల సంఖ్య పెరుగుతున్నది.
అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ మృతదేహాలను గుర్తించగా, 2023లో 1,183 గుర్తించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మృతుల వద్ద ఉన్న ఆధారాలతో కుటుంబసభ్యులను గుర్తించినా.. అంత్యక్రియల ఖర్చులు భరించలేక 2023లో 24 శాతం మృతదేహాలను తీసుకెళ్లలేదు. శ్మశాన వాటికల్లో మృతదేహాల ఖననానికి భారీగా డబ్బు చెల్లించాల్సి వస్తున్నది.
అంత్యక్రియల ప్రక్రియకు కూడా ఖర్చులు పెరిగిపోయాయి. ఒక్కో ప్రాంతంలో ఈ ఖర్చు ఒక్కోలా ఉంది. గ్రేటర్ టొరంటో నగరంలో అయితే అంత్యక్రియల ఖర్చు దాదాపుగా 34 వేల డాలర్లు అవుతున్నది. అంటే, మన కరెన్సీలో అక్షరాల రూ.27 లక్షలు. దీనికి అదనంగా వ్యాన్, ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ.30 లక్షలు అవుతున్నది. ఈ ఖర్చును భరించలేని కుటుంబాలు తమ వారి మృతదేహాలను బయటే వదిలేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

