నల్లగొండ : దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి కానిలాల్ నాయక్(Kanilal Naik) కఅనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) దేవరకొండలోని రవీంద్ర కుమార్ నివాసానికి చేరుకున్నారు. కానిలాల్ నాయక్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు(Tribute) అర్పించారు. అనంతరం రవీంద్ర కుమార్‌తో పాటు అయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. హరీశ్‌రావు వెంట మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నోముల భగత్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు.