Gopichand Thotakura | రోదసిలోకి తెలుగు వ్యక్తి .. విజయవంతంగా యాత్ర పూర్తిచేసిన గోపీచంద్ తోటకూర
తెలుగు యువకుడు గోపీచంద్ తోటకూర అరుదైన ఘనత సాధించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా గుర్తింపు పొందారు. బ్లూ ఆరిజిన్ ఎన్ఎస్ 25 మిషన్ ద్వారా ఆయన ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చారు.
- బ్లూ ఆరిజిన్ మిషన్ ద్వారా నింగిలోకి గోపీచంద్ తోటకూర
- మొదటి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా రికార్డు
Gopichand Thotakura | వాషింగ్టన్, మే 19: తెలుగు యువకుడు గోపీచంద్ తోటకూర అరుదైన ఘనత సాధించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా గుర్తింపు పొందారు. బ్లూ ఆరిజిన్ ఎన్ఎస్ 25 మిషన్ ద్వారా ఆయన ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చారు. పశ్చిమ టెక్సాస్ నుంచి ఆరుగురు సభ్యులతో తమ ఏడో మానవ సహిత వ్యోమనౌక(న్యూ షెఫర్డ్) రోదసిలోకి వెళ్లినట్టు బ్లూ ఆరిజిన్ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది.
పర్యటన తర్వాత వీరు వెళ్లిన కాప్సూల్ పారాచూట్ సాయంతో తిరిగి భూమి మీదకు చేరుకుంది. భూవాతావరణం, అంతరిక్ష సరిహద్దుగా భావించే కర్మన్ రేఖ ఎగువకు, భూవాతావరణం నుంచి 105.7 కిలోమీటర్ల ఎత్తుకు ఈ వ్యోమనౌక వెళ్లి వచ్చింది. అక్కడ కొన్ని నిమిషాల పాటు వీరు భారరహిత స్థితిని అనుభూతి పొంది తిరిగొచ్చారు. అంతరిక్ష పర్యటన కోసం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే.
ఎవరీ గోపీచంద్?
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గోపీచంద్ అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే పైలట్ శిక్షణ తీసుకున్నారు. పలు కమర్షియల్ జెట్లు, స్కైప్లేన్లు, ఎయిర్ ఆంబులెన్స్‌లకు పైలట్‌గా వ్యవహరించారు. తర్వాత ఆయన అట్లాంటాలో ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ అనే వెల్నెస్ కేంద్రాన్ని స్థాపించారు. 1984లో రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా, తొలి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా గోపీచంద్ చరిత్రకెక్కారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

