హెల్త్ ట్రాకర్/ ఫిట్నెస్ ట్రాకర్.. చేతి బ్యాండ్‌గా మొదలై.. వాచీగానూ, ఆ తర్వాత వేలి ఉంగరంగానూ రూపాంతరం చెందింది. ఇప్పుడు ‘నెక్ బ్యాండ్’గా సరికొత్త అవతారం ఎత్తింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ మొజావా.. ‘హాప్టి ఫిట్ టెరా’ పేరుతో ‘ఐపీ 68 ఆల్ఇన్వన్ ఏఐ స్పోర్ట్స్ ట్రైనర్’ను మార్కెట్లో విడుదల చేసింది. హాప్టిక్ టెక్నాలజీ, బోన్ కండక్షన్ ఆడియోతోపాటు ఏఐ స్పోర్ట్స్ ట్రైనర్‌తో వస్తున్న మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ స్పోర్ట్స్ పరికరం ఇదేనని సంస్థ చెబుతున్నది.
అత్యాధునిక సాంకేతికతతో రియల్ టైమ్ యాక్టివిటీ ట్రాకింగ్, రియల్ టైమ్ హెల్త్‌ను మానిటరింగ్ చేస్తుంది. ఇందులో ఓపెన్ ఇయర్ కంఫర్ట్‌తో ఏర్పాటుచేసిన సేఫ్టీ ఇయర్ బడ్స్.. ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. ఐపీ 68 వాటర్‌ప్రూఫ్ వల్ల స్విమ్మింగ్ చేసే సమయంలోనూ వీటిని ధరించొచ్చు. 32జీబీ ఎంపీ3 స్టోరేజీతో వస్తున్న ఈ పరికరంలో నచ్చిన పాటలను స్టోర్ చేసుకొని వినొచ్చు. రన్నర్లు, సైక్లిస్టులు, స్విమ్మర్లకు ఎంతగానో ఉపయోగపడే ఈ స్మార్ట్ స్పోర్ట్స్ ట్రైనర్ ధర.. రూ.25,000. mojawa.com తోపాటు అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.