(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఏటేటా అవినీతి పెరిగిపోతున్నది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెలువరించిన వార్షిక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (సీపీఐ)-2025 నివేదికలో భారత్ 91వ స్థానంలో నిలిచింది. 182 దేశాలకు ప్రతీయేటా స్కోర్, ర్యాంకులను ఇస్తారు.
100 పాయింట్లకు గానూ ఇచ్చే ఈ స్కోరులో తక్కువ పాయింట్లు సాధించిన దేశాల్లో ఎక్కువ అవినీతి ఉన్నట్టు లెక్క. అలా తాజా నివేదికలో 100 పాయింట్లకు 39 స్కోరుతో భారత్ 91వ స్థానానికి పరిమితమైంది. కాగా 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు అవినీతి సూచీలో 85వ ర్యాంకులో ఉన్న భారత్ ఇప్పుడు 91వ ర్యాంకుకు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
