తిరుమల : భక్తవత్సల గోవిందా.. భాగవత ప్రియ గోవిందుడు కొలువుదీరిన తిరుమల (Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం( Shilatoranam ) వరకు క్యూలైన్లో నిలబడ్డారు. గురువారం స్వామివారిని 66,842 మంది భక్తులు దర్శించుకోగా 28,670 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.27 కోట్ల ఆదాయం వచ్చింద న్నారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. 4.53 లక్షల లడ్డూలను విక్రయించామని, 2.77 లక్షల మందికి అన్న ప్రసాదం అందజేసామన్నారు.