Yadadri | యాదాద్రిలో నృసింహ స్వామి జయంత్యోత్సవాలు ప్రారంభం..
Yadadri | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ దేవాలయం శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీనృసింహస్వామి జయంత్యోత్సవాలను అర్చకులు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
Yadadri | యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ దేవాలయం శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీనృసింహస్వామి జయంత్యోత్సవాలను అర్చకులు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గర్భాలయ ముఖ మండపంలో మంత్ర సౌష్టవంగా, వేద సౌష్టవంగా, కళాత్మకంగా మహావైభోపేతంగా ఉత్సవాలు జరిగాయి. ఉదయం ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు.

8.30 గంటలకు ఆలయ ముఖ మండపంలో స్వస్తీవాచనం, విశ్వక్సేనారధన పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్ వరణం, కుంకుమార్చన, రక్షాబంధనం వంటి కైంకర్యాలను చేపట్టారు. అనంతరం శ్రీస్వామివారికి లక్ష కుంకుమార్చన గావించనున్నారు. 11 గంటలకు తిరు వేంకటపతి అలంకారసేవలో శ్రీస్వామి వారిని ఆలయంలో ఊరేగింపు చేపడతారు. సాయంత్రం 6.00 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహచార్యులు, తాండూర్ వెంకటాచార్యులు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహారెడ్డి , ఈవో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

