2,545 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు అనుమతివ్వండి
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ నిరంతరం పెరుగుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సౌర విద్యుత్తు కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)ని ఆశ్రయించాయి. మొత్తం 2,545 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన టారిఫ్‌ను ఆమోదించాలని పిటిషన్ దాఖలు చేశాయి.
- టీజీఈఆర్సీకి ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల పిటిషన్
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ నిరంతరం పెరుగుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సౌర విద్యుత్తు కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)ని ఆశ్రయించాయి. మొత్తం 2,545 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన టారిఫ్‌ను ఆమోదించాలని పిటిషన్ దాఖలు చేశాయి. విద్యుత్తు చట్టం-2003లోని 63, 86(1)(b) సెక్షన్లతోపాటు తెలంగాణ విద్యుత్తు సంసరణల చట్టం-1998లోని సెక్షన్ 21(4) ప్రకారం ఈ పిటిషన్ దాఖలు చేశాయి.
కేంద్ర ప్రభుత్వ పథకాల కింద మూడు వేర్వేరు సంస్థల నుంచి సౌర విద్యుత్తు కొనుగోలు చేయాలని డిసమ్లు ప్రతిపాదించాయి. మొత్తం 2,545 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్టు ఆ పిటిషన్లో పేరొన్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలికంగా తకువ ధరలో నాణ్యమైన విద్యుత్తును అందించడమే ఈ కొనుగోళ్ల ప్రధాన ఉద్దేశమని తెలిపాయి. ఈ పిటిషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24లోగా తెలియజేయవచ్చు. డిస్కమ్‌ల పిటిషన్‌పై టీజీఈఆర్సీ విచారణ నిర్వహించిన అనంతరం టారిఫ్ ఆమోదంపై తుది నిర్ణయం తీసుకుటుంంది. కమిషన్ అనుమతి లభించిన తర్వాత డిసమ్లు ఆయా సంస్థల నుంచి అధికారికంగా సౌర విద్యుత్తు కొనుగోళ్లు చేపడతాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

