60కి ముందే రిటైర్!
దేశంలోని నగరవాసుల్లో దాదాపు 70 శాతం మంది 60 ఏండ్ల కంటే ముందే రిటైర్ కావాలని కోరుకుంటున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. రిటైర్మెంట్ అనంతర జీవిత అవసరాలు తీరేలా ఆర్థిక పరిపుష్ఠి ఉన్నైట్టెతే సంప్రదాయ ఉద్యోగ విరమణ వయసు 58-60 ఏండ్లకు ముందే కొలువులకు గుడ్‌బై చెప్పాలని చూస్తున్నట్టు బుధవారం యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన భారతీయ రిటైర్మెంట్ ఇండెక్స్ అధ్యయనం తెలియజేసింది.
- దేశంలో 70 శాతం నగరవాసులది ఇదే ఆలోచన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: దేశంలోని నగరవాసుల్లో దాదాపు 70 శాతం మంది 60 ఏండ్ల కంటే ముందే రిటైర్ కావాలని కోరుకుంటున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. రిటైర్మెంట్ అనంతర జీవిత అవసరాలు తీరేలా ఆర్థిక పరిపుష్ఠి ఉన్నైట్టెతే సంప్రదాయ ఉద్యోగ విరమణ వయసు 58-60 ఏండ్లకు ముందే కొలువులకు గుడ్‌బై చెప్పాలని చూస్తున్నట్టు బుధవారం యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన భారతీయ రిటైర్మెంట్ ఇండెక్స్ అధ్యయనం తెలియజేసింది.
మెట్రో నగరాలతోపాటు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో నివసిస్తున్నవారి అభిప్రాయాలతో ఈ నివేదిక తయారైంది. ఇందులో 4,134 మంది గృహస్తులూ పాల్గొన్నారు. కాగా, రిటైర్మెంట్ కాలంలో ప్రస్తుత జీవనశైలినే కొనసాగించాలంటే ఎంత నిధి అవసరమన్నది 61 శాతం మందికి తెలుసన్న సర్వే.. 11 శాతం మాత్రమే తమ శేష జీవితానికి సరిపడా నిధి ఉందని చెప్పారన్నది.
ఇక 39 శాతం మంది తమ రిటైర్మెంట్ నిధి ఐదేండ్లకూ చాలదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇదిలావుంటే ప్రతి ఇద్దరిలో ఒకరు రిటైర్మెంట్ ప్రణాళికను కెరియర్ ఆరంభంలోనే చేసుకోవాలని చెప్తున్నారు. జెన్ జీలు ఈ వయసును 29 ఏండ్లుగానే పేర్కొంటుండగా, మిల్లేనియల్స్ 31 ఏండ్లుగా, జెన్ ఎక్స్‌ప్లస్ వయస్కులు 34 ఏండ్లుగా సిఫార్సు చేస్తున్నారు. ఇక 62 శాతం జెన్ జీలు ఇప్పటికే రిటైర్మెంట్ కోసం పెట్టుబడిని ప్రారంభించినట్టు చెప్పడం విశేషం. అయితే ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 52 శాతం మందే తమకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పడం గమనార్హం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

