న్యూఢిల్లీ : ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్టుగా నోబెల్ గ్రహీత మైఖెల్ క్రేమర్ నియమితులయ్యారు. ఇందర్మిట్ గిల్ స్థానంలో మైఖెల్ బాధ్యతలు చేపట్టనున్నారు. షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న క్రేమర్.. ప్రపంచ పేదరికాన్ని ఎలా తగ్గించవచ్చో చేసిన పరిశోధనలకు గాను 2019లో నోబెల్ బహుమతి అందుకున్నారు.
హార్వర్డ్ యూనివర్సిటీలోనూ ఆర్థిక శాస్ర్తాన్ని బోధించారు. బ్యాంకాక్‌లో ప్రపంచ బ్యాంకు ద్రవ్యనిధి వార్షిక సమావేశాలకు ముందు అక్టోబర్ 1నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. మైఖెల్ నియామకాన్ని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా స్వాగతించారు. మైఖెల్ చేసిన పరిశోధనలు ఇప్పుడు మనకు ఎంతో అవసరం అన్నారు.