కోహీర్, మే16 : అమెరికాలో( America) జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) అబ్బరాజు పృథ్వీరాజ్(30) వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్(Zaheerabad) పట్టణంలో విద్యుత్ శాఖలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన మధుర వెంకటరమణ కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్ ఎనిమిదేండ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాడు.
ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. కాగా, గురువారం ఉదయం చోర్లెట్ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వెళ్తున్న కారు అతడిని ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే తుదిశ్వాస విడిచాడు. ఇటీవల శ్రీప్రియతో పృథ్వీరాజ్‌కు(Prithviraj) వివాహం జరిగింది. పృథ్వీరాజ్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.