హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : కుమ్మెర జాతరలో పసిబిడ్డను పోగొట్టుకున్ను బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా, అక్కడి పోలీసులు నిందితుల పక్షాన కొమ్ముకాస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కులం, మతం పేరుతో, అత్యంత దారుణంగా వివక్ష చూపుతూ తన బిడ్డను స్థానిక కాంగ్రెస్ నేత పొట్టన పెట్టుకున్నాడని బాధిత తల్లి పోలీస్‌స్టేషన్ మెట్లెక్కితే.. పోలీస్‌వ్యవస్థ నిస్తేజంగా చూసిందని ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో నాగర్‌కర్నల్ జిల్లా కుమ్మెర జాతరలో అమానుష ఘటన, అనంతర పరిణామాలపై డీజీపీ శివధర్‌రెడ్డికి బీఆర్ఎస్ నేతల బృందంతో కలిసి శ్రీనివాస్‌గౌడ్ ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కులవివక్షతో రజక సామాజిక వర్గానికి చెందిన వారిని ఆలయంలోకి రానివ్వకపోవడంతో జరిగిన గొడవలో 2 నెలల చిన్నారి మృతి చెంది తే.. పోలీసులు నిందుతుల పక్షానే మా ట్లాడటం శోచనీయమని పేర్కొన్నారు. అగ్రకుల నాయకులు.. రెండు నెలల పసికందును కాలితో తంతే ఎగిరి బండపై పడిపోయి చనిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఓ పసి ప్రాణం పోయినా.. ఒక బాలింతను శారీరకంగా హింసించినా పోలీసులు పట్టించుకోరా? అని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. పోలీస్‌స్టేషన్‌కు బాధిత మహిళ ఎప్పుడు వచ్చిందో సీసీ కెమెరాలు పరిశీలించాలని, దాడికి పాల్పడిన వారిని పట్టుకొని ఎందుకు వదిలేశా రో? విచారణ జరుపాలని డీజీపీని డిమాండ్ చేశారు. వదిలిపెట్టిన నిందితులను 24 గంటల్లోగా పట్టుకోవాలని, నిందితులకు సమాచారం ఇచ్చిన పోలీసులను హత్యానేరం కింద సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
బాధిత రజక కుటుంబానికి ప్రభు త్వం రక్షణ కల్పించాలని, ఆ కుటుంబానికి రూ.కోటి సాయం అందజేయాలని, ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇ వ్వాలని, వేరే గ్రామంలో వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు. జాతీయ మానవహకుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజు యాదవ్, బీసీ కమిషన్ మాజీ స భ్యులు కిషోర్‌గౌడ్, ఉపేందర్‌చారి, నేత లు స్వామియాదవ్, రాజు పాల్గొన్నారు.