పరిషత్ ఎన్నికలు, భరోసా లేనట్టే.. మార్చి 20న బడ్జెట్.. 16 నుంచి అసెంబ్లీ
యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి మొండిచేయి చూపించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతుభరోసాపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించినా.. ఎలాంటి చర్చ లేకుండానే ము గించేశారు.
- రెండు కీలక అంశాలపై చర్చలేకుండానే ముగిసిన మంత్రివర్గ సమావేశం
- బడ్జెట్ సమావేశాల తేదీలపై గందరగోళం
- 16న రాజ్యసభ సభ్యుల ఎన్నిక
- బడ్జెట్ రోజున రంజాన్.. 19న ఉగాది
- పండుగల వేళ సభపై భిన్నాభిప్రాయాలు
- క్యాబినెట్ భేటీలో పలు నిర్ణయాలు
- మెట్రో పూర్తి స్వాధీనానికి ఆమోదం
హైదరాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ) : యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి మొండిచేయి చూపించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతుభరోసాపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించినా.. ఎలాంటి చర్చ లేకుండానే ము గించేశారు. అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనా చర్చకు రాకపోవడంతో ఇప్పట్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని ప రోక్షంగా తేల్చి చెప్పింది.
20న రాష్ట్ర బడ్జెట్
సచివాలయంలో సోమవారం జరిగిన క్యా బినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. 16న గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నా యి. 20న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27 బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఖరారు చేసిన బడ్జెట్ సమావేశాల తేదీలపై గందరగోళం నెలకొన్నది. బడ్జె ట్ సమావేశాల తేదీల్లో ముఖ్యమైన పండుగ లు రావడమే ఇందుకు కారణం. ఈ నెల 16న రాజ్యసభ ఎన్నికలు జరుగనుండగా, అదే రోజు శాసనసభలో ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి ఏర్పాటు చేసింది. రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఎలా సాధ్యమవుతాయనే చర్చ జరుగుతున్నది. ఇక మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించగా, అదే రోజు రంజాన్ పండుగ ఉండే అవకాశం ఉన్నది. ఒకవేళ నెలవంక కనిపించడం ఆలస్యమైతే రంజాన్ పండుగ 21న జరుగుతుంది. లేకపోతే 20వ తేదీనే రంజాన్ వస్తే పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతున్నది. ఇక 19న ఉగాది, 27న శ్రీరామ నవమి పండుగలు ఉండగా, ఇన్ని పండుగల మధ్య బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా నిర్వహిస్తారనే చర్చనీయాంశమైంది.
పేరుకే 15 రోజులు
ప్రభుత్వం పేరుకే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నా.. ఇందులో సగం రోజులు పండుగలు, ఆదివారాల పేరుతో సెలవులకే పోతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులు సభలో ఎలాంటి చర్చ జరుగని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బడ్జెట్ సమావేశాల్లో ప్రజాసమస్యలపై చర్చించేందుకు సమయం ఉండే అవకాశం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్కు ప్రజాసమస్యలపై ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే ప్రభుత్వం సమావేశాల తేదీలను ఖరారు చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
క్యాబినెట్లో కీలక నిర్ణయాలు
- క్యాబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ ప్రమాద బీమా పథకం అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబానికి రూ.1.2 కోట్లు ప్రమాద బీమా పరిహారం, 60 ఏండ్ల లోపు సహజ మరణం చెందితే అదనంగా రూ.10లక్షలు. 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది.
- ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్‌కు సం బంధించి ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ సీమ్ అమ లుచేయాలని నిర్ణయించారు.
- తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను(టీవీవీపీ)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా (డీఎస్‌హెచ్) మార్చాలని నిర్ణయించింది.
- వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంసరణలు చేపట్టాలని నిర్ణయించింది. అవసరమైన కొత్త విధానాలపై అధ్యయనం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయ, డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డితో కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
- వికారాబాద్ జిల్లాలోని చిట్టిగూడ, యా వాపూర్, టేకులపల్లి, ఎంకతాలను హెచ్ఎండీఎ పరిధిలో చేర్చాలని నిర్ణయం.
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీఆర్ఎంపీ చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- మంజీరా వాటర్ సప్లయ్ సీమ్ ఫేస్-1, ఫేస్-2 ఆధునీకరణ ప్రాజెక్ట్‌కు ఆమోదం. హైదరాబాద్ జలమండలి ప్రతిపాదనల మేరకు రూ.722కోట్లతో ఈ ప్రాజెక్ట్ పనులకు నిర్ణయం తీసుకున్నది. రూ.282 కోట్లతో ఉస్మాన్ సాగర్ మంచినీటి పైప్ లైన్ ఆధునీకరణకు ఆమోదం తెలిపింది.
- హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు ఆమో దం తెలిపింది. మార్చి 31లోగా ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలకు నిర్ణయం.
- మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీకి 70 ఎకరాలు, శాతవాహన వర్సిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజీ కోసం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉ మ్మాపూర్‌లో 36ఎకరాలు కేటాయించింది.
క్యాబినెట్‌కు తుమ్మల డుమ్మా
ఇటీవల అమరావతి వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబును కలిసి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం ఆసక్తికరంగా మారింది. సహచర మంత్రులు ఆయన కోసం 45 నిమిషాలపాటు వేచిచూసినట్టు తెలిసింది. అప్పటికీ ఆయన రాకపోవడంతో సీఎం రేవంత్ సమావేశాన్ని ప్రారంభించినట్టు తెలిసింది. తుమ్మలకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సమావేశానికి గైర్హాజర్ అయినట్టు తొలుత ప్రకటించినట్టు తెలిసింది. ఆ తరువాత కొద్దిసేపటికి రాష్ట్రంలోనే అందుబాటులో లేరని, విదేశాలకు వెళ్లారని మంత్రుల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రికి సమాచారం లేకుండా మంత్రి విదేశాలకు వెళ్తారా? అసలు ఏమైంది? అని మంత్రు ల మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

