ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ‘ఆట’విడుపు.. వీడియో గేమింగ్! గేమింగ్ కన్సోల్స్తోపాటు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్.. ఇలా అనేక రకాల ప్లాట్‌ఫామ్స్‌పై వీరు నిత్యం ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటారట. అలాంటి హార్డ్‌కోర్ గేమర్ల కోసం తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఎమ్ఎస్ఐ.. ‘క్లా’ పేరుతో సరికొత్త గేమింగ్ కన్సోల్‌ను విడుదల చేసింది. గేమింగ్ డెస్క్టాప్ను తలదన్నేలా.. ఇందులో అత్యాధునిక ఫీచర్లను జతచేసింది.
ఏడు అంగుళాల ఫుల్ హెచ్డీ టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్.. గేమర్లకు సరికొత్త గేమింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ/ 1 టీబీ స్టోరేజీతో వస్తున్న ఈ సరికొత్త కన్సోల్.. గేమింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కేవలం 675గ్రా బరువుండే ఈ పరికరం.. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వైఫై, బ్లూటూత్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పవర్‌బటన్ అదనపు ఫీచర్లు. మూడు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉన్న ఈ గేమింగ్ కన్సోల్ ధర.. రూ.88,990. msi.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.