NTR 31 | క్రేజీ న్యూస్.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చేసింది
NTR Birthday | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తారక్ సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్లు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేవర నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ విడుదల కాగా యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలావుంటే తారక్ సినిమాకు సంబంధించి మరో మూవీ అప్డేట్ వచ్చింది.
NTR Birthday | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తారక్ సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్లు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేవర నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ విడుదల కాగా యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలావుంటే తారక్ సినిమాకు సంబంధించి మరో మూవీ అప్డేట్ వచ్చింది.
కన్నడ స్టార్ దర్శకుడు కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ (PrashanthNeel)తో ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. #NTRNeel గా రానున్న ఈ సినిమాను గతేడాది ప్రకటించగా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. అయితే ఈ క్రేజీ కాంబో షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా.. ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్లు వస్తాయా అని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు తారక్ పుట్టినరోజు ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ ఆగష్టు 2024 నుంచి షూటింగ్ మొదలుకానున్నట్లు ప్రకటించారు.
Happy Birthday to the ‘MAN OF MASSES’ @tarak9999 ❤🔥
-Team #NTRNeel
Shoot begins from August 2024.
Brace yourself for a powerhouse project 🔥#HappyBirthdayNTR#PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial pic.twitter.com/HMmYVda7U2
— BA Raju’s Team (@baraju_SuperHit) May 20, 2024
ప్రశాంత్ ప్రస్తుతం సలార్ 2 షూటింగ్లో బిజీగా ఉండగా.. ఈ చిత్ర షూటింగ్ అనంతరం దీనిని సెట్స్ కి మీదకి తీసుకురానున్నాడు. ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే తారక్ ఫ్యాన్స్‌కు పండగే అని చేప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ రెండు పార్టులుగా తీయగా.. అవి ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. మరోవైపు సలార్ కూడా రెండు పార్టులుగా వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఇప్పటికే సూపర్ హిట్ అవ్వగా రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ 31 కూడా రెండు పార్టులుగా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉండనున్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kgf
- Mythri movie makers
- NTR
- ntr 31
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

