సుచిత్రలో భూ వివాదంపై.. ఏ సర్వేకైనా సిద్ధం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్ర చౌరస్తాలో మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదంలో తాము ఏ సర్వే చేపట్టినా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
- మా తప్పు తేలితే క్షమాపణ చెప్పి వెళ్లిపోతాం
- ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
కుత్బుల్లాపూర్,మే 19: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్ర చౌరస్తాలో మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదంలో తాము ఏ సర్వే చేపట్టినా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఆదివారం కొంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015లో తనతో పాటు మరో ఎనిమిది మంది కలిసి సర్వే నంబర్ 82/1/ఈఈలో నాలుగు వేల గజాల స్థలాన్ని కె.సుధామ వద్ద నుంచి కొనుగోలు చేశామన్నారు. 2021లో శేరి శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తికి అందరం కలిసి విక్రయించామన్నారు.
గతంలో మంత్రి పదవీలో కొనసాగిన మల్లారెడ్డి.. ఆ స్థలంలో ఎందుకు నిర్మాణ పనులు చేపట్టలేదని ప్రశ్నించారు. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినా.. దానికి ఎలాంటి స్పందన ఇవ్వలేదన్నారు. సర్వే చేయడానికి నోటీసులు ఇప్పిస్తే దానికి స్పందించకుండా తన వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డితో సమాధానం పంపించాడని, స్థలంలో వెలిసిన తేజా వైన్స్‌ను నిషేధించాలని ఎక్సైజ్ శాఖకు, అందులో ఎలాంటి వ్యవహారాలు జరపరాదని మున్సిపల్, పోలీసు శాఖలకు ఫిర్యాదులు చేసినా.. ఎవ్వరూ పట్టించుకున్న పాపనపోలేదన్నారు. మల్లారెడ్డికి సంబంధించిన స్థలం పక్కన ఉన్న తమ భూమిని ఆక్రమించి, సినీ ప్లానెట్ కట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారన్నారు.
సాటి ఎమ్మెల్యేగా గౌరవమిస్తానని, చట్టపరంగా వ్యవహరించాలని కోరారు. మాది తప్పు అని తేలితే అక్కడి నుంచి తప్పుకుంటామన్నారు. మల్లారెడ్డి ఏ సర్వే చేపట్టినా మేమంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ స్థలం విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా మాజీ మంత్రి మల్లారెడ్డి తనపై నిందలు వేయడం సరికాదన్నారు. తనకు సంబంధించిన భూమిని శేరి శ్రీనివాస్‌రెడ్డికి అమ్మినట్లు చెప్పారు. తనను ఈ భూ వివాదంలోకి లాగొద్దని, ఏదైనా న్యాయపరమైన అంశాలపై చర్చ ఉంటే తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఇన్చార్జి కొలన్ హన్మంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, రాష్ట్ర నాయకులు కొలన్ శ్రీనివాస్‌రెడ్డి, బీ బ్లాక్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

