Maya Tata | టాటాల వారసురాలు.. వ్యాపార రంగంలో మహిళల సత్తా చాటుతుందా?
మాయా టాటా... వ్యాపార రంగ దిగ్గజం రతన్ టాటా సోదరుడి కూతురు. టాటాల వ్యాపార వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే వారిలో ఆమెనూ ఒకరిగా పరిగణిస్తున్నారు. 34 ఏండ్ల మాయా టాటా తల్లిదండ్రులు అలూ మిస్త్రీ, నోయెల్ టాటా. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బేయర్స్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో మాయ ఉన్నత విద్య అభ్యసించారు.
Maya Tata | మాయా టాటా… వ్యాపార రంగ దిగ్గజం రతన్ టాటా సోదరుడి కూతురు. టాటాల వ్యాపార వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే వారిలో ఆమెనూ ఒకరిగా పరిగణిస్తున్నారు. 34 ఏండ్ల మాయా టాటా తల్లిదండ్రులు అలూ మిస్త్రీ, నోయెల్ టాటా. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బేయర్స్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో మాయ ఉన్నత విద్య అభ్యసించారు. ఇక ఆమె తల్లి అలూ మిస్త్రీ టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ తోబుట్టువు. అలా తల్లివైపు నుంచి కూడా మాయకు ఘనమైన వ్యాపార వారసత్వమే ఉందన్నమాట. నోయెల్ టాటానేమో రతన్ టాటాకు సవతి సోదరుడు. వృత్తిపరంగా మాయ ప్రయాణం టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో మొదలైంది.
తర్వాత టాటా డిజిటల్‌కు మారారు. ఈ క్రమంలో టాటా న్యూ యాప్ రూపకల్పనలో ఆమె కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. ఇందులో భాగంగా 2011లో రతన్ టాటా కోల్‌కతాలో ప్రారంభించిన క్యాన్సర్ హాస్పిటల్‌ను ఆమె పర్యవేక్షిస్తున్నారు. టాటాల వారసురాలిగా మాయ వ్యాపార రంగంలో భారతీయ మహిళల సత్తా ప్రపంచానికి చాటుతారని కోరుకుందాం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

