గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 16:37:30

జాగ్రత్తగా ఉందాం.. కరోనాను తరిమేద్దాం..

జాగ్రత్తగా ఉందాం.. కరోనాను తరిమేద్దాం..

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. కరోనాను అరికట్టేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఆయా రాష్ర్టాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. అందరం జాగ్రత్తగా ఉందాం.. కరోనాను తరిమేద్దామని మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు ఎవరూ కూడా కొన్ని రోజుల పాటు విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉంటారని మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలు కూడా అనవసరమైన విదేశీ ప్రయాణాలు మానుకోవాలని కోరుతున్నానని ప్రధాని తెలిపారు. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చర్యల్లో భాగంగానే పర్యాటక వీసాలు రద్దు చేశామన్నారు. ప్రజలేవరూ గుమిగూడవద్దని, దీంతో వైరస్‌ను అరికట్టొచ్చని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. 


logo
>>>>>>