సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 09:49:34

ఒక్క రోజే వెయ్యి కేసులు.. లాక్‌డౌన్ దిశ‌గా కేర‌ళ

ఒక్క రోజే వెయ్యి కేసులు.. లాక్‌డౌన్ దిశ‌గా కేర‌ళ

హైద‌రాబాద్‌: కేర‌ళ‌లో బుధ‌వారం ఒక్క రోజే సుమారు వెయ్యికి పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు  అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మ‌ళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ భావిస్తున్నారు.  బుధ‌వారం కేర‌ళ‌లో మొత్తం 1038 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దాంట్లో 24 మంది హెల్త్ వ‌ర్క‌ర్లు, అయిదుగురు కౌన్సిల‌ర్లు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 15,032కు చేరింది. మ‌ర‌ణించిన వారి సంఖ్య 45కు చేరుకున్న‌ది.  వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో సీఎం విజ‌య‌న్ గ‌త శుక్ర‌వార‌మే వ‌ర్చువ‌ల్ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వ‌హించారు. అయితే పూర్తి స్థాయి లాక్‌డౌన్ మ‌రోసారి అమ‌లు చేయాల‌ని నిపుణులు చెబుతున్న‌ట్లు ఆ స‌మావేశంలో సీఎం విజ‌య‌న్ వెల్ల‌డించారు.  


logo