గురువారం 28 మే 2020
National - May 09, 2020 , 16:28:01

రామజన్మభూమి విరాళాలకు పన్ను మినహాయింపు

రామజన్మభూమి విరాళాలకు పన్ను మినహాయింపు

న్యూఢిల్లీ: అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మిస్తున్న శ్రీ  రామ జన్మభూమి తీర్థ క్షేత్రకు ఇచ్చే విరాళాలను ఆదాయం  పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఉత్తర్వులు జారీచేసింది.  ఈ సంస్థకు దాతలు ఇచ్చే విరాళాలను ఆదాయం పన్ను చట్టం, 1961 సెక్షన్‌ 81 జీ ప్రకారం మినహాయింపు ఇచ్చారు. సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు అయోధ్యలోని రామజన్మభూమిలో శ్రీరాముడి గుడి కట్టేందుకు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర సిద్ధమైంది. ఇప్పటికే పలువురు పెద్ద మొత్తంలో ఈ సంస్థకు విరాళాలు అందించారు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర చారిటబుల్‌ ట్రస్ట్‌ అయినందున దీనికి అందే విరాళాలపై ఆదాయం పన్ను మినహాయింపు ఇవ్వొచ్చని సీబీడీటీ పేర్కొన్నది.


logo