KCR | ప్రధాని మోదీ నినాదాలన్నీ బక్వాస్.. మహూబూబ్‌నగర్‌లో కేసీఆర్ ఫైర్
KCR | దేశంలో పదేళ్ల నుంచి ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ గొప్పగొప్ప నినాదాలు ఇచ్చిండని, వాటిలో ఒక్క నినాదం కూడా నెరవేరలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ నినాదాలన్నీ బక్వాస్ అని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మహబూబ్‌నగర్‌లో పర్యటించిన మోదీ.. కేంద్రంలోని బీజేపీ సర్కారుపైన, ప్రధాని నరేంద్రమోదీపైన విమర్శల వర్షం కురిపించారు.
KCR : దేశంలో పదేళ్ల నుంచి ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ గొప్పగొప్ప నినాదాలు ఇచ్చిండని, వాటిలో ఒక్క నినాదం కూడా నెరవేరలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ నినాదాలన్నీ బక్వాస్ అని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మహబూబ్‌నగర్‌లో పర్యటించిన మోదీ.. కేంద్రంలోని బీజేపీ సర్కారుపైన, ప్రధాని నరేంద్రమోదీపైన విమర్శల వర్షం కురిపించారు.
కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘ఈ ఎన్నికల్లో ఇక్కడ మూడు పార్టీలు నిలబడ్డయ్. అందులో ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ, మరోటి బీజేపీ. బీజేపీ పదేళ్లుగా ఈ దేశాన్ని పాలిస్తోంది. ఈ పదేళ్లలో బీజేపీ చేసిందేందో ఒకసారి మీరంతా ఆలోచించాలి. ఈ పదేళ్లలో మోదీ కనీసం 100 నినాదాలు ఇచ్చిండు. ఒక్క నినాదం కూడా నెరవేరలేదు. వాటితో ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదు’ అని విమర్శించారు.
‘బేటీ పడావో.. బేటీ బచావో’ నినాదం. ఈ నినాదం నెరవేరిందా..? మేక్ ఇన్ ఇండియా ఓ బక్వాస్. సబ్ కా సాథ్.. సబ్‌గా వికాస్’.. దేశ్ కా సత్యనాశ్. ‘డిజిటల్ ఇండియా’.. డిజిటల్ ఇండియా అయ్యిందా..? ‘అచ్చే దిన్’ అచ్చే దిన్ వచ్చిందా.. సచ్చే దిన్ వచ్చిందా..? ‘అమృత్కాల్’ అమృత్కాల్ లేదు నా మన్ను కాల్ లేదు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ ఆత్మ నిర్భర్ భారత్ అయ్యిందా..? ‘జన్‌ధన్ యోజన’ ఏమన్నా లాభం జరిగిందా..? ‘ఫసల్ బీమా’ పంటలకు బీమా వచ్చిందా..? అన్నింటికంటే ముఖ్యమైనది నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు వస్తయని నరేంద్రమోదీ పదేళ్ల కింద చెప్పిండు. వచ్చినయా ఎవరికన్నా..? ఇన్ని గొప్ప పనులు చేసిన నరేంద్రమోదీ విశ్వగురువు. ఆయన విశ్వగురువేనా..?’ అని కేసీఆర్ ప్రధాని మోదీని ఏకిపారేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

