ఫారిన్ రెమిటెన్స్‌లపై నిఘా
ఫారిన్ రెమిటెన్స్‌లపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ దృష్టి పెట్టింది. చిన్నా, చితకా వ్యాపార కార్యకలాపాలతోనో లేదా అసలు ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే ఆయా సంస్థలు విదేశాల నుంచి భారత్‌కు జరుగుతున్న అనుమానిత నగదు బదిలీల్లో పాలు పంచుకొంటున్నాయన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ఐటీ శాఖ రంగంలోకి దిగింది.
- అనుమానిత విదేశీ నగదు బదిలీలపై దృష్టి పెట్టిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఫారిన్ రెమిటెన్స్‌లపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ దృష్టి పెట్టింది. చిన్నా, చితకా వ్యాపార కార్యకలాపాలతోనో లేదా అసలు ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే ఆయా సంస్థలు విదేశాల నుంచి భారత్‌కు జరుగుతున్న అనుమానిత నగదు బదిలీల్లో పాలు పంచుకొంటున్నాయన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ఐటీ శాఖ రంగంలోకి దిగింది.
ఈ క్రమంలోనే వీటి వెనుకున్న వ్యక్తులు, పన్ను నిర్ధారణ సర్టిఫికెట్లను జారీచేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ల (సీఏ)ను కనిపెట్టే దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే మంగళవారం దేశవ్యాప్తంగా అనుమానిత ఫారిన్ రెమిటెన్స్‌ల సమగ్ర పరిశీలనకు దిగింది. దేశ సరిహద్దు జిల్లాల్లో ఉన్న కంపెనీల రెమిటెన్స్లపైనా ఐటీ శాఖ నజర్ పెట్టింది.
దీంతో విదేశాల నుంచి పెద్ద మొత్తాల్లో వస్తున్న నగదు బదిలీలను అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, దాదాపు 394 సంస్థలపై ఐటీ శాఖ నిఘా పెట్టగా.. ఇందులో సరిహద్దు రాష్ర్టాల్లోనివి 117 ఉన్నాయి. అంతేగాక 36 మంది ప్రొఫెషనల్స్ కదలికలనూ ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్టు ఎక్స్‌లో ఐటీ శాఖ వెల్లడించింది. డొల్ల కంపెనీలు, ఫామ్ 15సీబీ/ఫామ్ 146 సర్టిఫికెట్లను జారీచేస్తున్న సీఏలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు పేర్కొన్నది.
రాష్ట్రపతి ఆమోదం
ట్యాక్సేషన్, ఇతర సవరణ చట్టాలు 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007కూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇక యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలను అమలుపర్చడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలు చిక్కినైట్టెంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

