భగ్గుమన్న బంగారం
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రిటైలర్లు, స్టాకిస్టులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో వరుసగా రెండోరోజూ బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి.
- రూ.2 వేలు పెరిగిన తులం ధర
న్యూఢిల్లీ, ఆగస్టు 18: బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రిటైలర్లు, స్టాకిస్టులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో వరుసగా రెండోరోజూ బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2 వేలు ఎగబాకి రూ.1,58,800కి చేరుకున్నది.
అంతకుముందు రోజు ఈ ధర రూ.1,56, 800గా ఉన్నది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా అధికమయ్యాయి. కిలో వెండి రూ.730 పెరిగి రూ.2,40,730 పలికింది. గత రెండు రోజులుగా ఫ్లాట్గా ఉన్న వెండి ధరలు అధికమయ్యాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,394.57 డాలర్లు పలుకగా, వెండి 65.08 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం వల్లనే గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,392 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నదని మిరాయి అసెట్ షేర్ఖాన్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

