న్యూఢిల్లీ : నీట్-పీజీ 2026 ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ గురువారం విడుదల చేసింది. ఎన్బీఈఎమ్ఎస్ అధికారిక వెబ్ సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని బోర్డు తెలిపింది. అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్ కార్డు అక్టోబర్ 1 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని బోర్డు వెల్లడించింది.
ఈ సారి క్యాటగిరీల వారీగా అర్హత కటాఫ్ మార్కులను కూడా బోర్డు రిలీజ్ చేసింది. జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 262 మార్కులు, జనరల్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 244 మార్కులు, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీలకు 226 మార్కులు కటాఫ్ గా నిర్ణయించారు.