హైదరాబాద్, ఆగస్టు 18: ప్రీమియం విండోస్, రైలింగ్స్, ఆటోమేషన్, స్మార్ట్-బిల్డింగ్ సేవల సంస్థ యాక్టివ్.ఇన్ విస్తరణ బాట పట్టింది. వచ్చే 12 నెలల నుంచి 18నెలల్లోపు దక్షిణాదిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి 15 అవుట్లెట్లను ప్రారంభించబోతున్నట్టు కంపెనీ సీఈవో, డైరెక్టర్ పీఎస్ఎల్ నరసింహ రావు తెలిపారు.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, భువనేశ్వర్ రాష్ర్టాల్లో అవుట్లెట్లను ప్రాంచైజ్ పద్దతిన నెలకొల్పబోతున్నట్టు ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.187 కోట్లుగా నమోదైన టర్నోవర్ ఈసారి రూ.250 కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌లో అల్యుమినియం, యూపీవీసీ విండోస్, డోర్స్ తయారీప్లాంట్లు ఉన్నాయని, త్వరలో సంగారెడ్డికి సమీపంలో రూ.75 కోట్ల పెట్టుబడితో గ్లాస్ యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్టు ఆయన ప్రకటించారు.