జోగులాంబ గద్వాల : గద్వాల మున్సిపాలిటీలో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగుల ( Muncipal Employees ) ను జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ (Suspension ) చేశారు. మున్సిపల్ షాపుల అద్దెలకు సంబంధించి వసూలు చేసిన రూ.11.28 లక్షలు సంబంధిత అధికారులు మున్సిపల్ ఖాతాలో జమ చేయకపోవడాన్ని తీవ్ర తప్పిదంగా పరిగణిస్తూ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ( Collector Rizwan Pasha ) మంగళవారం చర్యలు తీసుకున్నారు.
ఈ వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజవర్ధన్, జూనియర్ అసిస్టెంట్, ఇన్చార్జ్ షరాఫ్ రాజవర్ధన్ నాయుడిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు అదనపు కలెక్టర్ నర్సింగరావును విచారణ అధికారిగా నియమించారు. సంబంధిత రశీదు పుస్తకాలు, రికార్డులు, రిమిటెన్స్ వివరాలను పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.