బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 26, 2020 , 00:31:44

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు
  • -తాసిల్దార్‌ రియాజ్‌ అలీ
  • -ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

రెబ్బెన: ప్రజాస్వామ్యం విలువలను కాపాడుకోవడానికి ఓటును వినియోగించుకోవడం ఎంతో అవసరమని తాసిల్దార్‌ రియాజ్‌ అలీ పేర్కొన్నారు. శనివారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండల కేం ద్రంలో రెవెన్యూ సిబ్బంది, పలు ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీల్లో ర్యాలీలు తీసి ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. నక్కలగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్‌ పిట్టల సరిత, ప్రధానోపాధ్యాయుడు కల్వల శంకర్‌, విద్యా కమిటీ చైర్మన్‌ పూదరి భీంరావు, తదితరులు పాల్గొన్నారు. అలాగే రెబ్బెన ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు గ్రామాల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఎంఏ జాకీర్‌ ఉస్మాని, పో గ్రాం అధికారి గణేశ్‌, అధ్యాపకులు మల్లేశ్‌, రమేశ్‌, సమ్మ య్య, సౌమ్య, వందన, శైలజవాణి పాల్గొన్నారు.
లింగాపూర్‌: మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో విద్యార్థులు మానవహారం చేపట్టారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జైనూర్‌ సీఐ సురేశ్‌,  సిర్పూర్‌(యు) ఎస్‌ఐ విష్ణువర్ధన్‌, లింగాపూర్‌ ఏఎస్‌ఐ భీంరావ్‌, డీటీ చిత్రు, ఆర్‌ఐ అనిత, ఎంపీటీసీ శోభబలి రాం, ఉపాధ్యాయుడు వినోద్‌ పాల్గొన్నారు. 

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

వాంకిడి: 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ అజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండలంలోని కళాశాల, పాఠశాలల విద్యార్థులతో కలిసి బస్టాండ్‌ వరకు ర్యాలీ తీశారు. ప్రధాన రహదారిపై మానవహారం చేపట్టారు. అనంతరం ఓటు హక్కు వినియోగంపై తాసిల్దార్‌ రాంమోహన్‌రావ్‌ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బండే తుకారాం, ఎంపీటీసీ ఉప్రే పితాంబరావ్‌, ఎంఈవో మానుకుమార్‌, డిప్యూటీ తాసిల్దార్‌ రాథోడ్‌ బాబుసింగ్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రయ్య, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌, వామన్‌రావ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శనివారం బహుమతులు అందజేశారు. కార్యక్రమం లో పోగ్రాం చైర్మన్‌ వెంకటరమణ రెడ్డి, వైస్‌చైర్మన్‌ శంకర్‌, ప్రధానాచార్యులు కోటేశ్వర్‌రావు, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కెరమెరి: మండల కేంద్రంలో శనివారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తాసిల్దార్‌ కార్యాలయం నుంచి మార్కెట్‌ వరకు విద్యార్థులు, అధికారులు ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్‌ ప్రాంతంలో మానవహారం నిర్వహించారు. అందరం ఓటు హక్కును వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ ప్రమోద్‌, జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆడే ప్రకాశ్‌, ఆర్‌ఐ వెంకట్‌రావ్‌, ఎఫ్‌బీవో ప్రకాశ్‌, రెవెన్యూ సిబ్బంది, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జైనూర్‌: మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులు ర్యాలీ తీశారు. ప్రధాన చౌరస్తాలో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌ మాట్లాడుతూ ఓటు హక్కు రాజ్యంగంలో భారత పౌరులకు కల్పించబడిందని, ఈ హక్కు ఆయు ధం కన్న తక్కువేమి కాదని చెప్పారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ ఎజాజ్‌ఖాన్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రావణ్‌, ఎస్‌ఐ తిరుపతి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

తిర్యాణి: మండల కేంద్రంలోని కుమ్రం భీం చౌరస్తా నుంచి తాసిల్దార్‌ కార్యాలయం వరకు విద్యార్థులు, అంగన్‌వాడీలు, బీఎల్వోలు, మండల స్థాయి సిబ్బంది, అధికారులచే ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్‌ కార్యాలయ ఆవరణలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి గణతంత్ర దినోత్సవం రోజు  బహుమతులు అందజేస్తామని తాసిల్దార్‌ మస్కూర్‌ అలీ తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ అచ్యుత్‌రావు, బాలుర ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మడావి శే ఖు, జూనియర్‌ అసిస్టెంట్‌ తిరుపతి, ఆయా శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.logo
>>>>>>