బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 18, 2020 , 13:43:56

ప్రపంచ వ్యాప్తంగా కోటి 41లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కోటి 41లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. అమెరికా, ఇండియాతో పాటు అన్ని ప్రపంచ దేశాల్లో  కరోనా కలకలం రేపుతోంది.  కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోని ఎంతో మంది శాస్ర్తవేత్తలు వైరస్‌ కట్టడికి మందును కనుగొనేందుకు శ్రమిస్తున్నారు. ప్రంపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడినవారి సంఖ్య కోటి 41లక్షలు దాటింది.

మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. పంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,41,94,19 మందికి కరోనా వైరస్ సోకింది. అలాగే ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారు మొత్తం 5,99,416 మంది. కరోనా సోకి చికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకున్న వారు 84,70,275 మంది ఉన్నారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo