Harish Rao | రాజీనామా పత్రంతో గన్‌పార్క్‌కు బయల్దేరిన హరీశ్ రావు
హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao ) అన్నారు. బాండు పేపర్లు, సోనియా పేరుతో లేఖ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్: హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao ) అన్నారు. బాండు పేపర్లు, సోనియా పేరుతో లేఖ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజీనామా పత్రంతో హైదరాబాద్ కోకాపేటలోని తన నివాసం నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు ఆయన బయల్దేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బాండ్లకు కాలం చెల్లిందని సీఎం రేవంత్ రెడ్డి దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు. తన ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరిగితే మంచిదేనని చెప్పారు.
ఆగస్టు 15లోగా రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పడం బోగస్ అని విమర్శించారు. తాను రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వస్తున్నాని, సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ, ఆరు హామీలు అమలు చేయాలన్నారు. అలాచేసినట్లయితే తన పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
బిగ్ బ్రేకింగ్
రాజీనామా పత్రంతో మరికాసేపట్లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు ఎమ్మెల్యే హరీష్ రావు
ఆగస్టు 15వ తేదిలోపు రైతు రుణమాఫీ, ఆరు హామీల అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీ నేపథ్యంలో ప్రతి సవాల్ విసిరిన ఎమ్మెల్యే హరీష్ రావు. pic.twitter.com/1zqO3G7S7q
— Telugu Scribe (@TeluguScribe) April 26, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

