మంగళవారం 26 మే 2020
Hyderabad - May 08, 2020 , 23:36:38

జలమండలి ప్రాజెక్టులపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

జలమండలి ప్రాజెక్టులపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

మంత్రి కేటీఆర్‌ సమీక్షసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జలమండలికి సంబంధించిన తాగు, మురుగునీటి ప్రాజెక్టులపై మున్సిపల్‌, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం సమీక్షించారు. ఖైరతాబాద్‌ జలమండలి ప్రధాన కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌లతో కలిసి మంత్రి కేటీఆర్‌ వేసవి నీటి కార్యాచరణ, సివరేజీ మాస్టర్‌ప్లాన్‌, ప్రతిపాదిత ప్రాజెక్టులపై సుధీర్ఘంగా చర్చించారు. ప్రజలకు సమృద్ధిగా నీరందించే విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. అనంతరం ఖైరతాబాద్‌లో 20 ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఎస్టీపీని హెచ్‌ఎండీఏ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. హుస్సేన్‌సాగర్‌ ఎగువ ప్రాంతం నుంచి మురుగునీటి వ్యర్థాలు భారీగా వస్తున్నందున ఎస్టీపీల సామర్థ్యం మరింత పెంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. 


logo