గురువారం 28 జనవరి 2021
Gadwal - Dec 01, 2020 , 05:01:34

ఎయిడ్స్‌పై పూర్తి స్థాయిలో అవగాహన

ఎయిడ్స్‌పై పూర్తి స్థాయిలో అవగాహన

గద్వాలటౌన్‌ : ఎయిడ్స్‌పై జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందూనాయక్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  2019 ఏప్రిల్‌ నుంచి 2020అక్టోబర్‌ వరకు 14,146మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. అందులో 212మందికి పాజిటివ్‌ వచ్చిందని వారందరికీ చికిత్స అందిస్తున్నామన్నారు.

అలాగే 16,624మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించగా 15మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందన్నారు. పాజిటివ్‌ వచ్చిన గర్భిణులకు సురక్షితంగా ప్రసవాలు చేసి చికిత్స అందిస్తున్నామన్నారు. అలాగే ఎయిడ్స్‌తోపాటు టీబీ సోకిన 32మందికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మొత్తం జిల్లాలో 951మంది హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నారు. అందులో 363మంది ప్రతి నెలా రెండు వేల పింఛన్‌ తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులందరికీ  నిరంతరం చికిత్స అందిస్తున్నామన్నారు. ఎయిడ్స్‌ ని ర్మూలన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.


logo