మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 17:03:11

12 గంట‌ల్లో 21 క‌న్న‌డ పాట‌లు పాడిన బాలు

12 గంట‌ల్లో 21 క‌న్న‌డ పాట‌లు పాడిన బాలు

హైద‌రాబాద్ : ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం అంటే తెలియ‌ని వారంటే ఎవ‌రూ ఉండ‌రు. ఆయ‌న పాట‌లు అంత మాధుర్యంగా ఉంటాయి. ఆయ‌న గానం వింటే మ‌న‌సు హాయిగా ఉంటుంది. ఉత్తేజంతో ఉర‌క‌లేస్తారు సంగీత ప్రియులు. అంత‌టి గొప్ప మాధ‌ర్య‌మైన గొంతుతో 16కు పైగా భాష‌ల్లో 40 ఏళ్ల‌ల్లో 40 వేల‌కు పైగా పాట‌లు పాడి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు బాలు. ఒక సినిమా పాట‌లే కాదు.. భ‌క్తి గీతాల‌ను కూడా ఆల‌పించారు.  

1981 ఫిబ్ర‌వ‌రి 8న క‌న్న‌డ సంగీత ద‌ర్శ‌కుడు ఉపేంద్ర కుమార్ కోసం ఉద‌యం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వ‌ర‌కూ 21 క‌న్న‌డ‌ పాట‌లు పాడి బాలు రికార్డు నెల‌కొల్పారు. త‌మిళంలో ఒకే రోజు 19 పాట‌లు, హిందీలో ఒకే రోజు 16 పాట‌లు బాలు ఆల‌పించి మైమ‌రిపించారు. ఒక‌సారి అయితే రికార్డింగ్ థియేట‌ర్‌లో 12 గంట‌ల్లోనే ఆయ‌న 17 పాట‌లు పాడారు. సంస్కృతంలో బాలు వ‌ర్ణాల‌ను చ‌క్క‌గా ప‌లుకుతార‌ని పేరుంది.

ఈ-టీవీలోని పాడుతా తీయ‌గా, మాటీవీలోని పాడాల‌ని ఉంది షోల‌కు ఆయ‌న జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించారు. మ‌రోవైపు క‌న్న‌డ టీవీ షో ఎదె థుంబి హాదీవేను, త‌మిళంలో ఎన్నోపాటు పాడుంగ‌ల్ షోల‌నూ ఆయ‌న న‌డిపించారు.

కొద్దికాలం కిందట విడుదలైన మిథునం ఆయనకు నటుడిగానూ మంచి గుర్తింపునిచ్చింది. అలాగే ‘ఓ పాపా లాలీ’ అనే చిత్రంలో ఆయన నటననూ ఇప్పటికీ స్మరించుకుంటారు. ఆ సినిమాలో బాలు స్వయంగా ఒక బ్రీత్ లెస్ సాంగ్ పాడారు. తెలుగులో బ్రీత్‌లెస్ సాంగ్స్‌కి బాలునే ఆద్యుడని సంగీత ప్రేమికులు చెబుతారు.


logo