శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Jan 11, 2021 , 00:47:24

విలీన గ్రామాల అభివృద్ధి బాధ్యత నాదే

విలీన గ్రామాల అభివృద్ధి బాధ్యత నాదే

  • పోతురాజుపల్లి అభివృద్థికి రూ.3.50 కోట్లు
  • గ్రామ పర్యటనలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 

గీసుగొండ, జనవరి 10 : గ్రేటర్‌లో విలీనమైన గ్రామాల సమగ్ర అభివృద్ధి బాధ్యత తనదేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని రెండో డివిజన్‌ పోతురాజుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఆదివారం గ్రేటర్‌ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామం లో అధికారులలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  పోతురాజుపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, శ్మశానవాటికకు ప్రభుత్వం రూ.2.50 కోట్లు  చేసినట్లు తెలిపారు. మరో రూ.కోటి పనులకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మహిళా సంఘం భవనం పనులు పూర్తి కావాలన్నారు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు ఇప్పించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజాసమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతోనే అధికారులతో కలిసి గ్రామంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. పోతురాజుపల్లి గ్రామాన్ని రూ.3.50 కోట్లతో అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు పూర్తయిన వెంటనే మిషన్‌ భగీరథ పైపులైన్‌ వేసి, ఇంటింటికీ తాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ ల్యాదెళ్ల బాలయ్య, మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ గజ్జి రాజు, సొసైటీ చైర్మన్‌ రమేశ్‌, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు గోపాల నవీన్‌రాజు, వీరమల్లు,బాబురావు, పూర్ణచందర్‌, చిన్న వెంకటేశ్వర్లు, లవ్‌రాజు, రాజు, సారంగం, చిన్ని, భల్లు అశోక్‌, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.  


logo