Herschelle Gibbs : భారత జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబ బవుమా(Temba Bavuma) గాయపడిన విషయం తెలిసిందే. రెండో రోజు అతడు మైదానంలోకి దిగుతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బవుమా ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆజాగా ఆ జట్టు మాజీ ఓపెనర్ హెర్ష్లీ గిబ్స్(Herschelle Gibbs).. బవుమా ఫిట్‌నెస్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఫిట్గాలేని, బరువు ఎక్కువున్న కొందరు ఆటగాళ్లను కోచ్‌లు ఆడేందుకు అనుమతిస్తున్నారు. ఇది చాలా దారుణం’ అని గిబ్స్ అన్నాడు.
సెంచూరియన్‌లో జరుగుతున్న టెస్టులో టాస్ గెలిచిన బవుమా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అతడు ఊహించినట్టుగానే పేసర్లు రబాడ, బర్గర్ మొదటి సెషన్లోనే సఫారీలకు బ్రేక్ ఇచ్చారు. అయితే.. 20వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తుండగా బవుమా గాయపడ్డాడు. బంతిని ఆపేందుకు పరుగెత్తిన అతడు కండరాలు పట్టేడయంతో విలవిలలాడు. అనంతరం మైదానం వీడిన బవుమా డగౌట్‌కే పరిమితమయ్యాడు. దాంతో, మాజీ సారథి డీన్ ఎల్గర్ కెప్టెన్‌గా వ్యహరించాడు.
If Bavuma is unable to bat, South Africa will be a player short for the rest of the game #SAvINDhttps://t.co/e1j9tjWJW5
— ESPNcricinfo (@ESPNcricinfo) December 26, 2023
బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు భారత టాపార్డర్ విఫలమైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(5), యశస్వీ జైస్వాల్(17), శుభ్‌మన్ గిల్(2) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. దాంతో విరాట్ కోహ్లీ(38), అయ్యర్(31) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. ఆదిలోనే రోహిత్‌ను వెనక్కి పంపిన రబాడ.. ఆ తర్వాత వరుసగా కోహ్లీ, అయ్యర్ వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టాడు. అయితే.. శార్దూల్ ఠాకూర్(24)తో కలిసి కేఎల్ రాహుల్(70 నాటౌట్) జట్టును గట్టెక్కించాడు. రెండో రోజు మరో 50 పరుగులు జోడిస్తే భారత్ ఈ మ్యాచ్‌పై పట్టు బిగించే అవకాశం ఉంది.