GHMC | 43డిగ్రీలు.. గ్రేటర్ హైదరాబాద్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
గ్రేటర్లో బుధవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరోనా తరువాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే కరోనాకు ముందు 2019, 2018, 2015లో పలు మార్లు ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు
- పొంచి ఉన్న వడగాల్పుల ముప్పు
GHMC | సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో బుధవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరోనా తరువాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే కరోనాకు ముందు 2019, 2018, 2015లో పలు మార్లు ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే కరోనా తరువాత గరిష్ఠంగా 42డిగ్రీలు నమోదుకాగా ఈ వేసవిలో మాత్రం పగలు ఉష్ణోగ్రతలు 43డిగ్రీలకు చేరుకోవడం, దీనికి తోడు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 30డిగ్రీలకు చేరుకోవడం, గాలిలో తేమ 20శాతం కంటే కిందకు పడిపోవడంతో పగలు ఎండ, వడగాల్పులు, రాత్రి ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43.0డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.9డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 16శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో గ్రేటర్లో వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నట్లు తెలుస్తున్నది. అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని వాతావరణ, ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యం గా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రతలు వహించాలని, తరచూ ద్రవ పదార్థాలు తీసుకోవాలని, ఎక్కువగా నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

