గత డిసెంబర్ వరకు దర్జాగా బతికిన రైతన్నకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. మొన్నటివరకు రైతుబంధు రావడం లేదని గగ్గోలు పెట్టిన రైతులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రణాళిక లేమితోనే రాష్ట్రంలో ఎక్కడికక్కడ కల్లాలలో వడ్లు పేరుకుపోయాయనడంలో సందేహం లేదు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తానని గొప్పలకు పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం అవి ఇయ్యకపోగా కనీసం వడ్లను కొనే పరిస్థితిలో కూడా లేదు. ఆరుగాలం శ్రమించిన రైతులు వడ్ల కుప్పల కాడ పడిగాపులు కాస్తుంటే, ఢిల్లీ పెద్దల మెప్పును పొందడానికి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుల బాగోగుల గురించి ఆలోచించాలి. కల్లాల వద్ద ఉన్న వడ్లను గింజ మిగలకుండా కొనేటట్టు చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీచేయాలి.