Amitabh Bachchan | టీ20 వరల్డ్ కప్ భారత జట్టుకు అమితాబ్ స్పెషల్ మెసేజ్.. ఇది మహా యుద్ధం అంటూ..
Amitabh Bachchan | మరో నెలరోజుల్లో వెస్టిండీస్/అమెరికా వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) టీమిండియా జట్టుకు ప్రత్యేక సందేశాన్నిచ్చారు (special message for Indian team).
Amitabh Bachchan | మరో నెలరోజుల్లో వెస్టిండీస్/అమెరికా వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ పొట్టి కప్‌కు భారత జట్టు ఆటగాళ్లను కూడా ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) టీమిండియా జట్టుకు ప్రత్యేక సందేశాన్నిచ్చారు (special message for Indian team). తాజాగా తాను నటిస్తున్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)లోని అశ్వత్థామ అవతారంలో ‘టీ 20 ప్రపంకప్ 2024 కోసం శంఖనాదం మోగింది’ అంటూ ప్రత్యేక వీడియో ద్వారా భారత క్రికెట్ జట్టుకు స్పెషల్ మెసేజ్ ఇచ్చారు.
‘మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. విజయం ముందు తలొగ్గొద్దు. ఇది మహా యుద్ధం. గొప్ప పోరాటం. ధైర్యంగా ఉండండి. మీ సామర్థ్యాన్ని ప్రదర్శించండి. బలాన్ని చూపండి. ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయండి. శత్రువు కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి. అప్పుడు దేశం కోసం మీరు సిద్ధమవుతారు’ అంటూ క్రికెటర్లకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ (Prabhas) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిందని తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్‌కు ఇండియా జట్టు ఇదే..
మరోవైపు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ(BCCI) 19 మందితో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా, హార్దిక్ పాండ్యను వైస్ కెప్టెన్‌గా నియమించారు. అందరూ ఊహించనట్టుగానే వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లను ప్రపంచకప్ స్క్వాడ్‌కు ఎంపికచేశారు. శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అర్షద్ ఖాన్లు రిజర్వ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.
భారత స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.
Also Read..
Uma Ramanan | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని మృతి
Sridevi Chennai Home | చెన్నైలోని శ్రీదేవి లగ్జరీ ఇల్లు.. ఇప్పుడు రెంట్‌కు ఇస్తారట..!
Brij Bhushan | బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ షాక్.. కైసర్‌గంజ్ నుంచి ఆయన కుమారుడికి అవకాశం..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

