Brij Bhushan | బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ షాక్.. కైసర్‌గంజ్ నుంచి ఆయన కుమారుడికి అవకాశం..!
Brij Bhushan | మహిళా మల్లయోధులచే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కైసర్‌గంజ్ సిట్టింగ్ ఎంపీ (Kaiserganj Sitting MP), భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు బీజేపీ షాకిచ్చినట్లు తెలిసింది.
Brij Bhushan | మహిళా మల్లయోధులచే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కైసర్‌గంజ్ సిట్టింగ్ ఎంపీ (Kaiserganj Sitting MP), భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు బీజేపీ షాకిచ్చినట్లు తెలిసింది. కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి బ్రిజ్ భూషణ్‌ను తప్పించి ఆ స్థానాన్ని ఆయన కుమారుడికి కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. కైసర్‌గంజ్ సీటుపై బ్రిజ్ భూషణ్‌తో బీజేపీ నాయకత్వం ఫోన్లో మాట్లాడిందని, ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ (Karan Bhushan Singh)కు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని సదరు వర్గాలు తెలిపాయి. ఇక ఈ స్థానానికి మే 20న ఐదో దశ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది.
కాగా, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడంటూ (sexual harassment) పలువురు స్టార్ రెజ్లర్లు (women wrestlers) ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గదేడాది బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్రశ్రేణి రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా తదితరులు భారీ నిరసన చేపట్టారు. వీరి నిరసనలు తీవ్రతరం కావడంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై జూన్ 2023లో కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో ఆయనకు జూలై 20న బెయిల్ లభించింది. ప్రస్తుతం అతనిపై వచ్చిన అభియోగాలపై ఢిల్లీ కోర్టులో విచారణ కొనసాగుతన్న విషయం తెలిసిందే.
Also Read..
Lok Sabha Elections | హాట్ ఎయిర్ బెలూన్‌తో ఓటింగ్‌పై అవగాహన.. ఎన్నికల సంఘం వినూత్న ఆలోచన
Maneka Gandhi | మేనకా గాంధీ ఆస్తుల విలువ రూ.97 కోట్లు
Harish Rao | మన్నె క్రిశాంక్ అరెస్ట్ అప్రజాస్వామికం: హరీశ్ రావు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

