CM Vijay’s Divorce Case | సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు.. కేసు వాపస్ తీసుకున్న భార్య సంగీత
VijaySangeetha | తమిళనాడు రాజకీయ మరియు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ముఖ్యమంత్రి విజయ్ (Joseph Vijay) కుటుంబ వివాదానికి సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం వెలుగులోకి వచ్చింది.
Sangeetha Withdraws Petition | తమిళనాడు రాజకీయ మరియు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ముఖ్యమంత్రి విజయ్ (Joseph Vijay) కుటుంబ వివాదానికి సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం వెలుగులోకి వచ్చింది. సీఎం విజయ్ సతీమణి సంగీత, చెంగల్పట్టు జిల్లా కుటుంబ న్యాయస్థానంలో గతంలో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను అధికారికంగా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. సంగీత తన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయస్థానానికి తెలపడంతో, ఇరువర్గాల వాదనలను పరిశీలించిన చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఈ కేసుకు సంబంధించి తుది ఉత్తర్వులు వెలువరించింది. పిటిషన్ ఉపసంహరణను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం, ఈ విడాకుల కేసుకు సంబంధించి ప్రొసీడింగ్స్‌ను పూర్తిగా ముగిస్తున్నట్లు (Disposed of) ప్రకటించింది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి గత కొంతకాలంగా వివిధ రకాల వూహాగానాలు, వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, సంగీత స్వయంగా కోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఈ హైప్రొఫైల్ కుటుంబ వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

