Srivalli Rashmika | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఫ్లోరిడా(అమెరికా) వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక ఆకట్టుకుంది. బుధవారం జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రష్మిక 6-0, 6-0తో సియా కారికోవ్(అమెరికా)పై అలవోక విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో ఆధిపత్యం ప్రదర్శించింది.