UN | ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై మరోసారి వైఖరి స్పష్టం చేసిన భారత్
UN | ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై భారత్ వైఖరిని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మరోసారి స్పష్టం చేశారు. రెండు దేశాల సిద్ధాంతం మాత్రమే ఈ మధ్య వివాదాన్ని పరిష్కరించగలదని, అప్పుడే పాలస్తీనా ప్రజలు సురక్షితమైన సరిహద్దులతో స్వేచ్ఛగా జీవించగలుగుతారన్నారు.
UN | ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై భారత్ వైఖరిని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మరోసారి స్పష్టం చేశారు. రెండు దేశాల సిద్ధాంతం మాత్రమే ఈ మధ్య వివాదాన్ని పరిష్కరించగలదని, అప్పుడే పాలస్తీనా ప్రజలు సురక్షితమైన సరిహద్దులతో స్వేచ్ఛగా జీవించగలుగుతారన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ భద్రతా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న డిమాండ్‌కు భారత్ మద్దతు తెలిపింది.
గత నెలలో అమెరికా ఈ పాలస్తీనా డిమాండ్‌ను వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా సభ్యత్వంపై తగిన సమయంలో పునరాలోచన జరుగుతుందని, ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న ప్రయత్నానికి మద్దతు ఉంటుందని రుచిరా కాంబోజ్ తెలిపారు. 1974 సంవత్సరంలో పాలస్తీనా ప్రజల ఏకైక, చట్టబద్ధమైన ప్రతినిధిగా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌ను గుర్తించిన మొదటి అరబ్యేతర దేశం భారతదేశం కావడం గమనార్హం.
1988లో భారతదేశం పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించింది. బుధవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ప్రత్యక్షంగా, అర్థవంతమైన చర్చలు జరగాలన్నారు. రెండు దేశాల సూత్రంపై ఇరు దేశాలు పనిచేయాలని భారత నాయకత్వం పదేపదే నొక్కి చెబుతుందన్నారు. అప్పుడే శాంతి స్థాపన జరుగుతుందన్నారు. ఈ దిశగా నేరుగా శాంతి చర్చలను పునఃప్రారంభించాలని ఇరు దేశాలకు భారత్ సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

