ఏవీ వేసవిలో
నిండిన చెరువులు
నిండు కుండల్లా ఉన్న ప్రాజెక్టులు
ఏ నేల పంట చూసిన
ఎండిపోయిన వరిమల్లు
అన్నో ఇన్నో పండితే
కొనే నాథుడు లేడాయె
ఎటుచూసినా రైతుల కన్నీళ్లు!
ఎద యెదలోన వ్యథలు
ఆటోవాలాలకు
ఉరితాళ్లు
కర్షకులకు అరి రామ గోస!
ఆత్మహత్యల బాట!
తులం బంగారం
ఎక్కిరిస్తుంది
పింఛన్లు ఏమాయే,
రైతుబంధు రాదాయే
రైతుబీమా లేదాయే
కౌలుదార్లు
వలసబాట పట్టిరి!
పచ్చని తెలంగాణకు
మిడతల దండు పట్టే
తెలంగాణ పాడైపాయే
చెప్పేదొకటి చేసేదొకటితో
తెలంగాణ అతలాకుతలమాయే!
ఇల్లలకగానే పండుగంటిరి
పొయ్యిలో ఇంకా
పిల్లి లేవదాయే?
అకాల వర్షానికి అదేమి రోగమో!
గోడదెబ్బ చెంపదెబ్బ రైతన్నలకు
కడగండ్ల బాధ!
ఆపన్నహస్తం అందించి
ఆదుకునేదెవ్వరు?
ఉట్టిమాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేలు చేసే వారెవ్వరు?
గత ఎన్నికలకు
మాటలు కోటలు దాటే
కర్షకుల పంటల నేలలకు
నెర్రలొచ్చి నెత్తికి చేతులాయే!
అనావృష్టికి ఆదుకునే
ప్రభుత్వం లేదాయే!
ఓటేస్తేనే ఆడవారికి ఫ్రీ బస్సు!
బ్లాక్మెయిల్ రాజకీయమాయే!!