Mukesh Kumar Meena | ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు : ముఖేష్ కుమార్ మీనా
Mukesh Kumar Meena | ఏపీలో మొత్తం 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
అమరావతి : ఏపీలో మొత్తం 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ( Mukesh Kumar Meena ) వెల్లడించారు. గురువారం విజయవాడలోని ఎన్నికల ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు (Voters) , 65,707 సర్వీస్ ఓటర్లు(Service Voters) ఉన్నారని వివరించారు.
రాష్ట్రంలోని 25 లోక్‌సభ (Parliamentary) స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,300 మంది అభ్యర్థులు పోటి పడుతున్నారని పేర్కొన్నారు. ఈ రెండు ఎన్నికల పోలింగ్‌కు 46, 389 పోలీంగ్ స్టేషన్ల ను నెలకొల్పుతున్నామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12, 438 సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఈ కేంద్రాల్లో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులను నియమించామని వెల్లడించారు.
ఎన్నికల కోడ్ (Election Code) అమలు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 16,349 ఫిర్యాదులు రాగా 10,403 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. రూ. 382 కోట్ల నగదు, లిక్కర్, డ్రగ్స్, మెటీరియల్స్ తదితర వాటిని పట్టుకున్నామి వివరించారు. ఎన్నికల పరిశీలకుల రికమండేషన్ మేరకు 14 నియోజకవర్గాల్లో వంద శాతం వెబ్ కాస్టి్ంగ్స్ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్యాన్లు, కూలర్లు, షామియానాల ఏర్పాటు చేస్తున్నామన్నారు.
విశాఖలో మూడేసి బ్యాలెట్ యూనిట్లు..
విశాఖ పార్లమెంట్ స్థానానికి 33 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు 31 మంది వరకు పోటీ చేసే స్థానాల్లో రెండేసి బ్యాలెట్ యూనిట్లు (Ballot units) పెట్టాల్సి ఉండగా ఇక్కడా 33 మంది పోటీ చేస్తున్నందున మూడు బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా 10 పార్లమెంట్ పరిధిలో రెండేసి బ్యాలెట్ యూనిట్లను నెలకొల్పుతున్నామని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

