గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రిలే దీక్షలు ప్రారంభం
సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో మంగళ, బుధవారం రెండు రోజుల రిలే దీక్షలు ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో...
ఖమ్మం రూరల్, ఆగస్టు 18 : సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో మంగళ, బుధవారం రెండు రోజుల రిలే దీక్షలు ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో జలగం నగర్లో మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ప్రారంభించారు, ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు పెరుమాళ్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ.. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ వర్కర్స్ కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ వర్కర్స్ కు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నేరవేర్చలేదన్నారు.
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, పంచాయతీ వర్కర్స్ ను 2వ పీఆర్సీలో గుర్తించాలని,
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల నిర్మాణం చేసివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎండీఓ రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకుడు పొన్నం వెంకటరమణ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా నాయకుడు వల్లపు అనురాధ, మండల నాయకుడు ప్రభాకర్, చరణ్, చింతేటి వెంకటేశ్వరరావు, వీరబాబు, ఉప్పలి జయమ్మ, సైదమ్మ, డి.వెంకన్న, సంజీవులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

