తుంగతుర్తి, ఆగస్టు 18 : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గపు చర్య అని తుంగతుర్తి మాజీ ఎంపీపీ సీతయ్య విమర్శించారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నర్సంపేట ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండెగాని రాములు గౌడ్, తునికి సాయిల్ గౌడ్ పాల్గొన్నారు.