చుంచుపల్లి, ఆగస్టు 18 : చుంచుపల్లి మండల పరిధిలోని పెనగడప గ్రామ పంచాయతీ నడి ఒడ్డు గ్రామంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యలను చేపట్టారు. గ్రామ సర్పంచ్ కారం సీతారాములు, ఉప సర్పంచ్ మహమ్మద్ గోరిబాబు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హరీష్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది గ్రామంలోని వీధులు, కాలువలు, దోమలు అధికంగా ఉండే ప్రాంతాల్లో దోమల మందును పిచికారి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీనివాసరావు, హెచ్ఈఓ రవి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.