Hardik Pandya | ఢిల్లీ: ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా ఐపీఎల్-17లో రెండోసారి జరిమానా ఎదుర్కొన్నాడు. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో భాగంగా నిర్దేశిత సమయంలో ఓవర్ల కోటాను పూర్తిచేయకపోవడంతో అతడిపై ఫైన్ పడినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
హార్దిక్‌కు రూ.24 లక్షల జరిమానా విధించగా జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత లేదా రూ.6 లక్షల ఫైన్ (ఏది తక్కువైతే అది) విధించినట్టు బీసీసీఐ వెల్లడించింది. గతంలో పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ హార్దిక్ జరిమానాకు గురయ్యాడు.