SRH vs RR | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కాసేపట్లో తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. వీటిలో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం ఒకటే ఓడిపోయి అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అదే విజయాల పరంపర కొనసాగించాలని చూస్తోంది. ఇక గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఐదో స్థానానికి పడిపోయిన హైదరాబాద్.. టాప్ -4లో ప్లేస్ కోసం తహతహలాడుతోంది. దీంతో ఈ మ్యాచ్ ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
ఇప్పటివరకు ఐపీఎల్లో అత్యధిక స్కోర్ (287 ) సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది. ఇది కాకుండా ఈ సీజన్లో మూడు సార్లు 260 పరుగులు చేసింది. దీంతో ఈసారి కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 పరుగులు చేస్తుందేమోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదరుచూస్తున్నారు. విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు కాబట్టి 300 స్కోర్ చేయడం పెద్ద విషయమేమీ కాదని కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మరి అభిమానుల అంచనాలను సన్‌రైజర్స్ ఏ మేర అందుకుంటారో చూడాలి!
హైదరాబాద్ జట్టు
హెడ్, అభిషేక్, అన్మోల్ ప్రీత్, క్లాసెస్, నితీశ్, సమద్, షెహబాజ్, జాన్సన్, కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్
రాజస్థాన్ జట్టు
జైస్వాల్, శాంసన్, రియాన్, జూరెల్, పావెల్, హిట్మెయిర్, రవిచంద్రన్, బౌల్ట్, అవేశ్ ఖాన్, చాహల్, సందీప్