Dulquer Salmaan | దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’ విడుదల తేదీ ఫిక్స్.. వచ్చేది ఆ రోజునే!
Dulquer Salmaan | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఆకాశంలో ఒక తార' (Aakasam Lo Oka Tara).
Dulquer Salmaan | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasam Lo Oka Tara). ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ఫీల్ గుడ్ మూవీని నవంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న దుల్కర్ సల్మాన్.. “ఇప్పటివరకు ఈ ప్రయాణం చాలా అందంగా సాగింది. నవంబర్ 20న ఈ సరికొత్త ప్రపంచాన్ని మీ అందరికీ పరిచయం చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. ఇట్లు మీ కృష్ణ” అంటూ తన పాత్ర పేరుతో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా మరియు లైట్‌బాక్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
This one has been a lovely journey so far ❤️
Can’t wait to introduce you all to this world on November 20th 🤗
Yours,
Krishna #AakasamLoOkaTara #AOTMovie#AOTonNOV20th @pavansadineni @GeethaArts @SwapnaCinema @Lightboxoffl @shrutihaasan @satveeravalli @gvprakash @grajug… pic.twitter.com/qEKUxFmcpV— Dulquer Salmaan (@dulQuer) September 17, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Basar IIIT | బాసర ట్రిపుల్ ఐటీకి నీటి కరువు.. నీటి సమస్యతో తరగతులు బంద్
Cyclone Arnab | ‘అర్ణబ్’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్
Land Scam | అసైన్డ్ ఖల్లాస్.. 1000 కోట్ల విలువైన లావణి భూముల్లో బిగ్ విల్లాస్!.. మంఖాల్‌లో భూ కైంకర్యం
Horoscope | 26-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ఆ ఆలస్యం నాకిష్టంలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

