Addanki Dayakar | పొద్దున లేస్తే దళితులపై ప్రేమను ఒలకపోసే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం అది వట్టి భూటకం అని ఎన్నోసార్లు రుజువు చేశారు. తాజాగా ఓ ఎమ్మెల్సీ విషయంలోను ఇలాంటి నీచమైన పనికి మరోసారి పూనుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న అద్దంకి దయాకర్‌ను వెనుక వరుసలో కూర్చోబెట్టి, ఎలాంటి ప్రభుత్వ హోదా లేని రేవంత్ రెడ్డి అనుచరులను ముందు వరుసలో కూర్చోబెట్టడం చర్చకు దారితీసింది. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో ఎలాంటి ప్రభుత్వ హోదా లేని వ్యక్తులు రేవంత్ రెడ్డి అనుచరులు ఫహీమ్ ఖురేషి, రోహిన్ రెడ్డి ముందు వరుసలో కూర్చోబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పొద్దున లేస్తే దళితుల గురించి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అయిన అద్దంకి దయాకర్‌ను వెనుక వరుసలో ఎలా కూర్చోబెట్టింది? దళితుల ఆత్మ గౌరవం గురించి నీతులు కోతలు చెప్పే అద్దంకి దయాకర్‌కు ఎందుకీ వివక్ష అని అనిపించక పోవడం గమనార్హం. కాంగ్రెస్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.
అద్దంకి దయాకర్ వెనక వరుసలో
ఫహీమ్ ఖురేషి, రోహిన్ రెడ్డి ముందు వరుసలోఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న అద్దంకి దయాకర్‌ను వెనుక వరుసలో కూర్చోబెట్టి, ఎలాంటి ప్రభుత్వ హోదా లేని రేవంత్ రెడ్డి అనుచరులను ముందు వరుసలో కూర్చోబెట్టడం చర్చకు దారితీసింది.
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా… pic.twitter.com/3PbY0Dbkd4
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026